: మహేష్ బాబు 'స్పైడర్' శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో రెండు పాటలు, క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓ వైపు షూటింగ్ కొనసాగుతుండగానే, బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసింది సినిమా యూనిట్. రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రూ. 150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలున్నాయిని చెబుతున్నారు. భారీ మొత్తం చెల్లించి ఓ ఛానల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ రైట్స్ కోసం సదరు ఛానల్ ఏకంగా రూ. 26 కోట్లు చెల్లించిందట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

  • Loading...

More Telugu News