: హైదరాబాద్ నుంచి ఏపీకి పెరగనున్న ఆర్టీసీ సర్వీసులు.. టీఎస్ ఆర్టీసీ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌కు సర్వీసులు పెంచాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) నిర్ణయించింది. త్వరలోనే మరిన్ని సర్వీసులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే బస్ స్టేషన్లలో శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లకు మరమ్మతులు చేయడంతోపాటు నిర్వహణకు సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. బస్టాండ్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి మునిసిపాలిటీ కనెక్షన్లు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంగా టీఎస్ ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అధికారులకు టార్గెట్లు విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.