: భారత్‌తో బేరసారాలకే జాదవ్‌కు ఉరిశిక్ష?
భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు ఉరిశిక్ష విధించడం వెనక పాక్ భారీ వ్యూహానికి తెరతీసిందా? ఆయన ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందా? పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు జాదవ్ ద్వారా కసి తీర్చుకోవాలని భావిస్తోందా? అన్న ప్రశ్నలకు అవుననే అంటున్నారు ప్రతిష్ఠాత్మక ఉడ్రోవిల్సన్ దక్షణాసియా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ కుగెల్‌మన్.
అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు జాదవ్ ఉరిశిక్షను తెరపైకి తెచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. జాదవ్‌ను రక్షించేందుకు భారత్ ముందుకొస్తే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్ బేరసారాలకు దిగేందుకు కూడా వెనకాడబోదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ప్రమాదకర సంబంధాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, జాదవ్ ఉరిశిక్ష ప్రకటనతో అవి మరింత క్షీణించే అవకాశముందని అభిప్రాయపడ్డారు.