: మరింత పెరిగిన పసిడి ధర
బంగారం ధరలు ఈ రోజు మరింత పెరిగి ఈ నెలలో గరిష్ఠానికి చేరాయి. ఈ రోజు రూ.410 పెరిగి, 10 గ్రాముల బంగారం ధర రూ.29,760గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడమే పసిడి ధరలు పైకి ఎగబాకడానికి కారణమని విశ్లేషకుల అంచనా. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.05 శాతం పెరిగి 1,274.60 డాలర్లుగా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. ఈ రోజు కిలో వెండి రూ.925 పెరిగి రూ.42,750గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగింది.