: లండన్లో రాములోరి కల్యాణం... హాజరైన 800 మంది భక్తులు
ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో లండన్లో రాములోరి కల్యాణం జరిగింది. 80 కుటుంబాలు స్వామివారి కల్యాణంలో పాల్గొనగా ఈ వేడుకను చూసేందుకు 800 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో రాముడు, సీతను కల్యాణ వేదికపైకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా అన్నమాచార్య కీర్తనలు, భక్తిపాటలు, చిన్నారులకు రామాయణంపై క్విజ్ పోటీలను కూడా నిర్వహించారు. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం, జేఈటీ యూకే సంయుక్తంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించాయి.