: చంద్రబాబును అభినందించిన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభినందించారు. అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం నిర్మించాలనే ఆలోచన చాలా గొప్పదని... ఈ విషయంలో బాబును అభినందిస్తున్నానని ఆమె చెప్పారు. ఈ స్మృతివనం కోసం యమునా నది నుంచి నీటిని, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సేకరించింది. పార్లమెంటు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా ఏపీ ప్రతినిధులు మట్టిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News