: భారీ ఎన్ కౌంటర్... మరోసారి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే


మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరోసారి తృటిలో తప్పించుకున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఈ రోజు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ స్థలంలో నాలుగు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నారు. ఘటనా స్థలంలో మూడు ఏకే47లు స్వాధీనం చేసుకున్నారు. ఈ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలికి అదనపు భద్రతాదళాలు చేరుకున్నాయి. చనిపోయిన మావోలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పారిపోయిన మావోల కోసం కూంబింగ్ జరుగుతోంది. ఎన్ కౌంటర్ నేపథ్యంలో, అన్ని జిల్లాల ఎస్పీలను అలర్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News