: తిరుమల శ్రీగంధం వనంలో ఓ కూలీపై కొండ చిలువ దాడి!
తిరుమలలోని పాపవినాశనం రహదారిలో ఉన్న శ్రీగంధం వనంలో ఓ కూలీపై కొండ చిలువ దాడి చేసింది. అక్కడి అటవీ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ గంధం మొక్కలను పెంచుతున్నారు. ఆ వనంలో పని చేస్తున్న హరి అనే కార్మికుడిపై ఈ రోజు ఓ కొండచిలువ దాడి చేసింది. దీంతో, అప్రమత్తమైన తోటి కూలీలు పదిహేను అడుగులు ఉన్న ఈ కొండ చిలువను కర్రలతో కొట్టి చంపారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.