: సినీ నటుడు కళాభవన్ మణి మృతిపై సీబీఐ విచారణకు కేరళ హైకోర్టు ఆదేశం
ప్రముఖ సినీ నటుడు కళాభవన్ మణి (45) గత ఏడాది మార్చి 6న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాని కళాభవన్ మణి భార్య నిమ్మీ, సోదరుడు రామకృష్ణన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు ఆయన మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. నెల రోజుల్లో ఈ కేసులో విచారణను పూర్తి చేసి తమకు నివేదిక సమర్పించాలని పేర్కొంది.