: ఆ విషయంలో శ‌శిథ‌రూర్‌ సాయం కోరలేదు.. ఆ వార్తలు అవాస్తవం!: సుష్మా స్వరాజ్


పాకిస్థాన్ ఆర్మీ కోర్టు భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్‌ జాధవ్‌కి ఉరిశిక్ష విధించినట్టు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో భార‌త్ మండిప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, పాక్ నిర్ణ‌యాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని తయారు చేయడంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సాయం కోరినట్లు ప‌లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఆ విష‌యంపై కేంద్ర మంత్రి సుష్మా స్వ‌రాజ్ స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆమె ఖండించారు. తాను శ‌శిథ‌రూర్‌ని ఎటువంటి సాయం కోరలేదని ఆమె ట్వీట్‌ ద్వారా తేల్చి చెప్పారు. తన మంత్రిత్వ శాఖలో ప్రతిభకు కొదవ లేదని పేర్కొన్నారు. త‌న శాఖ‌లో తనకు సాయం చేయగలిగే కార్యదర్శులు ఉన్నారని ఆమె అన్నారు.



  • Loading...

More Telugu News