: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అఖిలేశ్ దాస్ గుప్తా మృతి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అఖిలేశ్ దాస్ గుప్తా (56) మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. యూపీఏ-1 ప్రభుత్వంలో ఆయన ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. లక్నో మేయర్ గా కూడా ఆయన విధులు నిర్వహించారు. రెండు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను చేపట్టారు. ఈయన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బనారసి దాస్ కుమారుడు. రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే రియల్ ఎస్టేట్, మీడియా, విద్యా సంస్థల వ్యాపారాలను ఆయన నిర్వహించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ గా కూడా ఆయన వ్యవహరించారు.