: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం....కంపించిన 16 నగరాలు


ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారు జామున సంభవించిన భూకంపం ఫిలిప్పీన్స్ వాసులను భయాందోళనల్లోకి నెట్టింది. రిక్టరు స్కేలుపై 6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి సుమారు 16 పట్టణాల్లో ప్రజలు వణికిపోయారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోవడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు తలోదిక్కుకు పరుగులు తీశారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులైనట్టు ప్రాధమిక సమాచారం అందుతోంది. ఆస్తి, ప్రాణ నష్టంపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. ప్రకంపనలు మళ్లీ వచ్చే ప్రమాదం ఉండడంతో, స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సురక్షిత ప్రాంతాల ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News