: బీజేపీపై నిఘా పెట్టిన అమెరికా... వికీలీక్స్ వెల్లడి


వికీలీక్స్ మరో సంచలనాన్ని బహిర్గతం చేసింది. బీజేపీతో పాటు ప్రపంచ దేశాల్లోని అనేక పార్టీలపై అమెరికా నిఘా పెట్టిందనే విషయాన్ని వెల్లడించింది. మన దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహాలపై అమెరికా జాతీయ భద్రత సంస్థ నిఘా నేత్రాన్ని ఉంచిందని తెలిపింది. పలు దేశాల్లోని రాజకీయ పార్టీలపై ఇదే తరహా నిఘాను పెట్టిందని చెప్పింది. వికీలీక్స్ తాజాగా బయటపెట్టిన నివేదికలో ఏయే దేశంలోని ఏయే పార్టీలపై అమెరికా నిఘా పెట్టిందో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఈ లీక్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.

భారత ప్రధాని మోదీ వ్యూహాలను తెలుసుకునే విషయంలో ట్రంప్ సర్కారు చాలా ఆసక్తిగా ఉందని వికీలీక్స్ తెలిపింది. పాకిస్థాన్ లోని పలు పార్టీలపై కూడా అమెరికా నిఘా పెట్టింది. పాకిస్థాన్ మొబైల్ సిస్టమ్ ను కూడా యూఎస్ పూర్తిగా హ్యాక్ చేసిందని వెల్లడించింది. మరోవైపు, తమ దేశ భద్రత కోసం నిఘా వ్యవస్థను ఉపయోగించుకుంటున్నట్టు అమెరికా సమర్థించుకుంటోంది. 

  • Loading...

More Telugu News