: రణ్ బీర్ తో ముద్దు సీన్లు తొలగించమన్న కత్రినా కైఫ్?


రణ్ బీర్ కపూర్ తో కత్రినా కైఫ్ బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రణ్ బీర్ తో నటించిన 'జగ్గా జాసూస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమాలో ముద్దు సీన్లు తొలగించాలని కత్రినా డిమాండ్ చేసినట్టు బాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రణ్ బీర్ నుంచి దూరమైన కత్రినా మళ్లీ సల్మాన్ తో సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో రణ్ బీర్ తో నటించిన 'జగ్గా జాసూస్' సినిమాలో ముద్దు సీన్లు తొలగించాలని దర్శకుడు అనురాగ్ బసును కోరిందట. అయితే ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉండగా, పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోందని, ఇంకా ఆలస్యం చేస్తే ఈ సినిమా అనుకున్న ఆదరణ పొందదని అనురాగ్ బసు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 కత్రిన కోరినట్టు ముద్దు సీన్లు తొలగించాలంటే కధను మార్చాల్సి ఉంటుందని, మళ్లీ పలు సన్నివేశాలను చిత్రీకరించాల్సిన అవసరం ఉంటుందని అనురాగ్ బసు భావిస్తుండడంతో కత్రిన కోరికను మన్నించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే రణ్ బీర్, కత్రినా బ్రేకప్ అనంతరం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి నెలకొనలేదు. కత్రినా డిమాండ్ కారణంగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. అయితే హీరో ప్రేయసితో కలిసి తన తండ్రిని వెతికే క్రమంలో ఘాటైన ముద్దు సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. వాటిని చూసి సల్మాన్ నొచ్చుకుంటాడని భావిస్తుందేమో మరి!.

  • Loading...

More Telugu News