: మాజీ ప్రేమికులు ప్రీతి జింటా, నెస్ వాడియాలు కలిసిపోయారా?


మాజీ ప్రేమికులు ప్రీతి జింటా, నెస్ వాడియాలు కలిసిపోయారా? అవును, పదేళ్లు భగ్నప్రేమికులుగా ఉండి, ఐపీఎల్ లో ఫ్రాంచైజీని కొనుగోలుచేసి, విభేదాలు పొడసూపడంతో, ఘర్షణపడి కేసులు పెట్టుకుని మరీ విడిపోయారు. దీంతో గత ఏడాది ప్రీతి జింటా వ్యాపారవేత్త గుడెనఫ్ ను వివాహం చేసుకుంది. తరువాత సినిమాల్లో కనిపించనప్పటికీ ఐపీఎల్ సీజన్ లో ఫ్రాంఛైజీ యజమానిగా సందడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఐపీఎల్ సీజన్ 10లో మ్యాచ్ గెలిచిన అనంతరం జట్టు సభ్యులతో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వివాదాలు మరచి, స్నేహంగా ఉందామని కూడా అనుకున్నారని బాలీవుడ్ సమాచారం. మొత్తానికి బాలీవుడ్ మాజీ ప్రేమికులు కలుసుకోవడం ద్వారా వివాదాలకు స్వస్థి చెప్పినట్టే. 

  • Loading...

More Telugu News