: వదంతులు నమ్మొద్దు.. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయి: ఆర్బీఐ
రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న వదంతులపై ఆర్బీఐ అధికారులు స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఏపీ, తెలంగాణలో రూ.10 నాణేలు చెల్లవంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, అవన్నీ అపోహలేనని పేర్కొంది. పాత, కొత్త పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని, అన్ని దుకాణాల్లో వీటిని వినియోగించుకోవచ్చని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావంటూ గతంలో కూడా ఇదే మాదిరి వదంతులు వ్యాపించాయి. ఈ వదంతులను నమ్మవద్దని ఆర్బీఐ గతంలో కూడా ప్రకటించింది.