: నీవు బలవంతుడివి కావచ్చు.. కానీ, నీ కంటే సమయం ఎంతో బలమైనదని గుర్తు పెట్టుకో: ధోనీ భార్య ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి రావత్ ఇటీవల ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్టు చేసిన పలు పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పక్షులు బతికున్నప్పుడు చీమలను తింటాయని, అయితే పక్షి చనిపోయిన తర్వాతే చీమలు దాన్ని తింటాయని ఆమె ఓ పోస్టు చేసింది. టైంతో పాటు పరిస్థితులు మారిపోతూ ఉంటాయని, ఎవరినీ తక్కువ చేసేలా లేదా అవమానించేలా ప్రవర్తించవద్దని ఆమె పేర్కొంది. 'ఈ రోజు నీవు బలవంతుడు కావచ్చు కానీ, నీ కంటే సమయం ఎంతో బలమైనదని గుర్తు పెట్టుకో' అని ఆమె పేర్కొంది. ఓ చెట్టు పదిలక్షల అగ్గిపుల్లలను అందిస్తుందని, అయితే పది లక్షల చెట్లను కాల్చడానికి ఓ అగ్గిపుల్ల చాలని భారీ డైలాగులని వదిలింది. కాబట్టి మంచిగా ఉండాలని, మంచి చేయాలని ఆమె పేర్కొంది.
గతంలో ఐపీఎల్ సీజన్‌లలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ జట్టు అధికారులపై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఐపీఎల్ నుంచి ఈ జట్టును రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన పుణె తరఫున ఆడుతున్నాడు. అయితే, ఈ సీజన్‌లో పుణె యాజమాన్యం ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించింది. ధోనీకి, పుణె యాజమాన్యానికి పడటం లేదని వార్తలు వచ్చాయి. పుణె టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు హర్ష్ గోయెంకా ధోనీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాక్షి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

A post shared by Sakshi (@sakshisingh_r) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-04-10T08:09:08+00:00">Apr 10, 2017 at 1:09am PDT</time>