: నూకాలమ్మ అమ్మవారికి బంగారు కిరీటాన్ని బహూకరించిన చంద్రబాబు
విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మ వారి ఆలయంలో సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అమ్మవారికి బంగారు కిరీటాన్ని చంద్రబాబు బహూకరించారు. అనంతరం, అక్కడి నుంచి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన చేరుకున్నారు. అక్కడ నిర్మించిన 100 పడకల ప్రసూతి వార్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు.