: కుల్ భూషణ్‌ను ఉరితీస్తే సింధ్ ప్రావిన్స్‌ను పాక్ విడిచి వెళ్లాల్సి వస్తుంది: సుబ్రహ్మణ్య స్వామి
భారతీయ నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ను గూఢచారిగా పేర్కొంటూ పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. జాదవ్‌ను ఉరితీస్తే, బలోచిస్థాన్‌ను భారత్ స్వతంత్ర దేశంగా గుర్తించాల్సిందేనని వ్యాఖ్యానించారు. సింధ్ ప్రావిన్స్‌ను పాక్ విడిచి వెళ్లాల్సిందేనని ఆయన అన్నారు. కుల్ భూషణ్ కు పాక్ ఉరిశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించిన వెంటనే పాక్ తీరుని ఖండిస్తూ భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.