: ఏటీఎం కార్డులు తారుమారు చేసి మోసాలకు పాల్పడే ముఠా అరెస్టు
ఏటీఎం కార్డులను తారుమారు చేసి మోసాలకు పాల్పడే ఓ ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సామాన్యుల ఏటీఎం కార్డులను ఈ ముఠా చాలా తెలివిగా తారుమారు చేసి నగదును డ్రా చేసుకుంటుంది. నకిరేకల్, నిర్మల్, కామారెడ్డి, వరంగల్, ఖమ్మం, నాగపూర్ లో మోసాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.2.34 లక్షల నగదు, ఓ కారు, ఏటీఎం కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.