: పెళ్లికి కొన్ని నిమిషాల ముందు ప్రియుడితో పారిపోయిన వధువు!
కర్ణాటక ధార్వాడ నగరంలోని దైవజ్ఞ కల్యాణ మండపంలో అచ్చం సినిమా సీనును తలపించేలా ఓ సంఘటన చోటు చేసుకుంది. మూడు ముళ్లు వేయించుకునేందుకు కొన్ని నిమిషాల ముందు పెళ్లికూతురు తన ప్రియుడితో కలసి ఉడాయించింది. ముహూర్తం సమీపించడంతో పెళ్లి కూతురిని తీసుకురావాల్సిందిగా పురోహితులు చెప్పడంతో వధువు రూంలోకి వెళ్లిన వారు, ఆమె అక్కడ కనిపించకపోవడంతో షాక్ తిన్నారు. పెళ్లికూతురు కనిపించకుండా పోయిందంటూ చెప్పారు. వెంటనే ఆమె కోసం చుట్టుపక్కల అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ వధువు తన ప్రియుడితో వెళ్లిపోయినట్లు పెళ్లి పెద్దలు తెలుసుకున్నారు. దీంతో అంతవరకూ కళకళలాడిన పెళ్లిమండపం కాసేపట్లోనే కళావిహీనం అయింది.