: థాయ్ లాండ్ లో ఎంజాయ్ చేసి వస్తున్నా.. అవన్నీ పుకార్లే: నటి కిమ్ శర్మ
'ఖడ్గం' సినిమా ఫేం కిమ్ శర్మ తన భర్త అలీ పంజానీతో విడిపోయిందని, ప్రస్తుతం ఆమె తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోందని కొంత కాలంగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలను కిమ్ ఖండించింది. అవన్నీ పుకార్లు మాత్రమేనని... తన దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారని ప్రశ్నించింది. వీకెండ్ నాడు థాయ్ లాండ్ లో ఎంజాయ్ చేసి వస్తుంటే... నా చేతిలో చిల్లిగవ్వ లేదని రాసేస్తున్నారంటూ మండిపడింది. తన గురించి తన కంటే వారికే ఎక్కువ తెలిసినట్టుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కెన్యాలో స్థిరపడ్డ వ్యాపారవేత్త అలీ పంజానీని 2010లో కిమ్ వివాహం చేసుకుంది. అలీ ఇప్పుడు వేరే అమ్మాయి మోజులో పడి కిమ్ ను వదిలేశాడని, దీంతో ఆమె కెన్యా నుంచి ముంబై వచ్చేసిందని, ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటోందని వార్తలు వెలువడ్డాయి.