: జగన్ పై అసత్య ప్రచారం చేయడం చంద్రబాబుకు తగదు: వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన


తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై అసత్య ప్రచారం చేయడం సీఎం స్థాయి వ్యక్తి అయిన చంద్రబాబుకు తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డికి కోల్ కతాలో సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, అధికార పార్టీ ఆరోపించడం తగదని, ఈ ఆరోపణలను రుజువు చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదని అన్నారు.

  • Loading...

More Telugu News