: కేటీఆర్, హరీష్ రావుల మధ్య మనస్పర్థలను తొలగించే పనిలో కేసీఆర్ ఉన్నారు!: రేవంత్ రెడ్డి
కేటీఆర్, హరీష్ రావుల మధ్య నెలకొన్న మనస్పర్థలను తొలగించే పనిలో పడ్డ సీఎం కేసీఆర్, రాష్ట్ర పరిపాలనను గాలి కొదిలేశారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. భవిష్యత్ లో కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరుగుతుందని, అందులో టీడీపీ ప్రధాన పాత్ర పోషిస్తుందని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరును ఆయన విమర్శించారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.