: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు.. 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు


తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి ప్ర‌తాపం ధాటికి మ‌ధ్యాహ్న వేళ‌ల్లో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. మధ్య భారతావనిలో కొనసాగుతున్న ఉష్ణగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గ‌రిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు మ‌రో రెండు రోజుల పాటు మధ్యప్రదేశ్‌, మరాట్వాడల్లో తీవ్రస్థాయి ఉష్ణగాలుల ప్రభావం కొనసాగుతుంద‌ని చెప్పారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ‌ల్లో సగటు ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల మేర పెరిగాయని పేర్కొన్నారు. కడప, కర్నూలు నగరాల్లో ఈ రోజు అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు.

మిగ‌తా  ప్రాంతాల్లో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలు..
 అనంతపురం- 42 డిగ్రీలు
 నంద్యాల, తిరుపతి- 41 డిగ్రీలు
 జంగమహేశ్వరరం- 40 డిగ్రీలు
 నందిగామ- 39 డిగ్రీలు
 విశాఖపట్నం, తుని, కావలి, కాకినాడ -36 డిగ్రీలు
 మచిలీపట్నం, ఒంగోలు- 35 డిగ్రీలు
 నర్సాపురం, కళింగపట్నం- 34 డిగ్రీలు

తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం, మెదక్‌-  42 డిగ్రీలు
భద్రాచలం, మహబూబ్‌నగర్‌- 41 డిగ్రీలు
హన్మకొండ, హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండ- 40 డిగ్రీలు
హకీంపేటలో 39 డిగ్రీలు

  • Loading...

More Telugu News