: యోగిని చూసి నేర్చుకోండి: ఫడ్నవిస్ కు శివసేన సూచన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని చూసి నేర్చుకోవాలంటూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కు శివసేన సూచించింది. ప్రజల సంక్షేమం కోసం యోగి అనేక నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారని తెలిపింది. తన పని తీరుతో విమర్శకుల మెప్పును సైతం యోగి పొందుతున్నారంటూ కితాబిచ్చింది. ఈ మేరకు తన పత్రిక సామ్నాలో కథనాన్ని ప్రచురించింది. ఫడ్నవీస్ సర్కారు మాత్రం ప్రతి విషయంలోను మీన మేషాలు లెక్కిస్తోందంటూ విమర్శించింది. రైతుల పంట రుణాలను మాఫీ చేసే విషయాన్ని ఇక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడింది. మహారాష్ట్రలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఫడ్నవీస్ కు చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించింది. యోగి మాత్రం తన తొలి కేబినెట్ సమావేశంలోనే రైతు రుణ మాఫీ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపింది.