: ప్రధాని మోదీపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ప్రశంసలు
భారత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మల్కం టర్నబుల్ కొనియాడారు. ప్రస్తుతం మల్కం టర్నబుల్ భారతపర్యటనలో ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య బంధం బలమైందని ఆయన అన్నారు. ఆర్థిక వృద్ధి పథంలో మోదీ భారత్ ను ప్రశంసనీయమైన రీతిలో ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. భారత్ సాధించిన విజయాలు ప్రపంచానికి ప్రశంసదాయకమని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో సత్సంబంధాలు మరింత పెంచుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. తమ దేశంలోని 5 లక్షల మందికి భారత నేపథ్యముందని చెప్పారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. రేపు ఆయన ముంబైలో పర్యటించి అక్కడ ప్రముఖ వ్యాపారవేత్తలతో పలు అంశాలపై చర్చించనున్నారు.