: పోలీసులపైనే కిరోసిన్ పోసి నిప్పంటించబోయిన గ్రామస్థులు


మహారాష్ట్ర, థానేలోని అంబివిల్లి గ్రామవాసులు పోలీసుల‌పైనే కిరోసిన్ పోసి నిప్పంటించ‌బోయారు. వెంటనే విష‌యాన్ని గ‌మ‌నించి పోలీసులు తుపాకుల‌తో వారిని బెదిరించ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌తో గ్రామ‌స్థుల‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే... గొలుసు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఓ నిందితుడిని ప‌ట్టుకోవడానికి అంబివిల్లి గ్రామానికి 10 పోలీసుల టీమ్ వెళ్లింది. అయితే, తమ గ్రామంలోకి వచ్చి తనిఖీలు చేస్తూ త‌మ‌ను అనుమానిస్తున్నారంటూ 20 మంది గ్రామస్థులు పోలీసుల‌పై ఇలా కిరోసిన్ పోశారు.

  • Loading...

More Telugu News