: నా మీద, ముస్లింల మీద కోపంతో ఉన్నారు... అందుకే ఈ గోవును మీరే ఉంచుకోండి!: స్వామీజీకి ఆజం ఖాన్ లేఖ


ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజం ఖాన్ కు కపిల గోవును గోవర్ధన పీఠం శంకరాచార్య స్వామి అధోక్షజానంద్‌ మహారాజ్‌ బహుమతిగా ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆజం ఖాన్, ఆ గోవును తిరిగి అధోక్షజానంద్ మహారాజ్ కు తిప్పి పంపివేస్తూ లేఖ రాశారు. ఇందులో ఆయన 'కపిలగోవును పంపినందుకు ధన్యవాదాలు. అయితే స్వామీజీ... ప్రస్తుతం సమాజంలో ముస్లింలు అభద్రతాభావంతో జీవిస్తున్నారు. అదే సమయంలో పలువురు వ్యక్తులు నాపైన, ముస్లిం వర్గంపైన కోపంతో ఉన్నారు. వారు ఆ గోవును చంపినా చంపేసే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మీకు ఈ ఆవును తిప్పి పంపిస్తున్నాను...అన్యదా భావించవలదు' అంటూ లేఖ రాశారు. 

  • Loading...

More Telugu News