: కాపులను ఏపీ ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
కాపులను ఏపీ ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు. కాపు కులస్తుల శక్తిని, వాళ్ల ఆలోచనలను ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను. కాపు ఉద్యమం అనేది వ్యక్తులకు సంబంధించింది కాదు. వాళ్ల గుండె చప్పుడు.. ఆ ఉద్యమాన్ని ముద్రగడ పద్మనాభం గారు స్వీకరించారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని ప్రభుత్వం చెప్పింది. కనుక, ఆ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉండాలి’ అని అన్నారు. ఇటీవల ఆరు జిల్లాల్లో జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం బీజేపీ కార్యకర్తల సాయాన్ని టీడీపీ తీసుకోలేదని ఆయన విమర్శించారు.