: సరబ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియో
పాకిస్థాన్ జైలులో సాటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన సరబ్ జిత్ కుటుంబానికి కేంద్రం ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఎక్స్ గ్రేషియో వారికి అందించనున్నారు. మరోవైపు సరబ్ జిత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు భారత్ పంపుతున్న ప్రత్యేక విమానం పాక్ కు బయలుదేరింది. ఈరోజు రాత్రికి విమానం తిరిగి భారత్ చేరుకునే అవకాశముంది.