: 'నీట్'పై ముఖ్యమంత్రికి లేఖ రాస్తా: చంద్రబాబు


గుంటూరు జిల్లాలో ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును, ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిసి ... 'నీట్' పరీక్ష రద్దు చేయించాలంటూ కోరారు. ఈ విషయంలో విద్యార్ధులతో కలిసి పోరాడుతాననీ, దీని రద్దుకై సీఎంకు లేఖ రాస్తానని బాబు ఈ సందర్భంగా విద్యార్ధులకు హామీ ఇచ్చారు. జిల్లాలో ఐదవ రోజు జరుగుతున్నయాత్రలో భాగంగా స్థానిక బృందావన్ గార్డెన్స్ వద్ద బాబు కాసేపు ప్రసంగించారు. అధికార కాంగ్రెస్ పై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రాష్ట్రంలో పెరిగిన సంపద అంతా కాంగ్రెస్ నేతల జేబుల్లోకే వెళుతోందని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News