: చంద్రబాబు మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది?: పురందేశ్వరి


చంద్రబాబు మీద తనకు కోపం ఎందుకు ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా బీజేపీ మహిళా నేత దగ్గుబాటి  పురందేశ్వరి చెప్పారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబుతో శత్రుత్వం లేదని, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై నాడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఏపీలో జరిగిన ఫిరాయింపులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశానని ఆమె అన్నారు. తాను రాసిన లేఖ పై విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం గొప్ప విషయమని, మోదీ మూడేళ్ల పాలనకు పదికి తొమ్మిదిన్నర మార్కులు వేస్తున్నానని పురందేశ్వరి అన్నారు.

  • Loading...

More Telugu News