: సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీస్తానని చెప్పిన రాజమౌళి
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీస్తానని దర్శక ధీరుడు రాజమౌళి అన్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో నిన్న బాహుబలి-2 తమిళ ఆడియో విడుదల కార్యక్రమం, మీడియా సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... ప్రస్తుతం తన మదిలో మాత్రం బాహుబలి తప్ప వేరే ఆలోచన ఏదీ లేదని, కానీ రజనీతో ఏదో ఒకరోజు సినిమా తీస్తానని పేర్కొన్నారు. బాహుబలి సినిమా వెయ్యి సంవత్సరాల కిందట జరిగినట్లు చూపించే ఓ ఊహాజనితమైన కథ అని అన్నారు.
ఇందులో యుద్ధ సన్నివేశాల్లో అప్పట్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారో ఊహించుకొని వాటినే చూపించామని రాజమౌళి చెప్పారు. బాహుబలి-2లో పాత్రల మధ్య సంఘర్షణ కనపడుతుందని చెప్పారు. ఈ సినిమాలోని పాత్రలను మరింత బాగా వివరించేందుకు టీవీ సీరీస్, యానిమేషన్స్, ఇతర రూపకాల్లో కొనసాగిస్తామని రాజమౌళి చెప్పారు. తనకు మహాభారతం తీయాలని ఎప్పటినుంచో ఉందని, తాను తీయడానికి సిద్ధపడినప్పుడు ఆ విషయంపై చెబుతానని అన్నారు.