: డీఎస్, కేకేలను అడిగితే ఆ విషయం చెబుతారు!: టీఆర్ఎస్ కు వీహెచ్ సూచన
టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మరోమారు మండిపడ్డారు. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాష్ట్రం లభించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో టీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలంటే, తమ పార్టీలో ఉన్న డీఎస్, కేకేలను అడిగితే చెబుతారని అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని, 1969 తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.