: ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!
ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీ లోని పలు ప్రాంతాల్లో సగటు కంటే 5 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. కర్నూలు, కడపలో 42, అనంతపురం, తిరుపతిలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరులో 40, విజయవాడ, రాజమండ్రిలో 39 డిగ్రీలు, ఒంగోలు, శ్రీకాకుళంలో 37 డిగ్రీలు, నరసాపురం, విశాఖలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు.