: గూండాల దాడుల్లో చనిపోతున్న భారతీయులకు కూడా సంతాపం ప్రకటించండి: మోదీపై లాలూ ట్వీట్
స్వీడెన్ రాజధాని స్టాక్‌హోంలో మూడు రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ అంశంపై స్పందిస్తూ... ‘సమయం కుదిరినప్పుడు గూండాల దాడుల్లో చనిపోతున్న భారతీయులకు కూడా సంతాపం ప్రకటించండి’ అంటూ ట్వీట్ చేశారు. దేశంలో గోరక్షకుల పేరుతో అకృత్యాలు పెరిగిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో లాలూ ఇలా ట్వీట్ చేశారు. ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్‌లో గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న నెపంతో ఓ వృద్ధుడిపై పలువురు దాడి చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ వ్యక్తి గోవులను కొనుక్కుని తన ప్రాంతానికి తీసుకెళుతుండగా ఆ దాడి జరిగిందని దర్యాప్తులో తేలింది.