: సికింద్రాబాద్‌లో 40 మంది చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న ముఠా


సికింద్రాబాద్‌లో అభం శుభం తెలియని చిన్నారులతో భిక్షాట‌న చేయిస్తోన్న ఓ వ్య‌క్తిని ఆ ప్రాంత ప‌రిధిలోని గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్య‌క్తి మూడేళ్ల బాలుడితో సికింద్రాబాద్‌లో భిక్షాటన చేయిస్తున్నాడని, ఈ కేసులో ఆ బాలుడి పెద్దమ్మను కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. వారిని విచారించ‌గా ఓ ముఠా సికింద్రాబాద్‌లో మొత్తం 40 మంది చిన్నారులను ఇదే వృత్తిలోకి దింపింద‌ని పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఆ ముఠాను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.  

  • Loading...

More Telugu News