: బాలయ్యతో విభేదాలు లేవు: అక్కినేని నాగార్జున


గత కొంత కాలంగా సినీన‌టులు బాలకృష్ణ‌, అక్కినేని నాగార్జునల‌ మధ్య మాటలు లేవని, వీరిద్ద‌రి మధ్య గొడవలు వున్నాయని ఎన్నో వార్త‌లు ప్రచారంలో వున్న విష‌యం తెలిసిందే. అయితే, నిన్న విశాఖపట్నంలో టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్ నిర్వ‌హించిన జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో నాగార్జున, బాల‌య్య క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ... త‌మ‌ ఇద్దరి మధ్య స్నేహం లేదని ఎన్నో పుకార్లు షికార్లు చేశాయని.. కానీ, అవ‌న్నీ అసత్యాలేన‌ని అన్నారు. విభేదాలు ఏమీ లేవని నాగ్ స్పష్టం చేయడంతో.. నాగ్, బాల‌య్యల అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బాలకృష్ణ గ‌త ఏడాదికిగానూ ఉత్తమ కథానాయకుడి అవార్డు అందుకోగా, నాగార్జున ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. మొత్తానికి టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్ వీరిద్ద‌రినీ ఒకే వేదిక‌పై క‌లుసుకునేలా చేసింది.

  • Loading...

More Telugu News