: మూడు కీలక వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్!


ఐపీఎల్ సీజన్ 10లో భాగంగా ఐదో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆదిలోనే విధ్వసంకర ఆటగాడు క్రిస్ గేల్ (6) ను మోరిస్ అవుట్ చేశాడు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నం చేసిన మన్ దీప్ సింగ్ (12) ను కుమ్మిన్స్ పెవిలియన్ కు పంపాడు.

ఈ దశలో కెప్టెన్ షేన్ వాట్సన్ (24) జాగ్రత్తగా ఆడాడు. వాట్సన్ ను నదీమ్ పెవిలియన్ కు పంపాడు. దీంతో కేదార్ జాదవ్ (10) కు, స్టువర్ట్ బిన్నీ జతకలిశాడు. వీరిద్దరూ బెంగళూరును ఆదుకుంటే ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేస్తుంది. కాగా, జహీర్ సారధ్యంలో డిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు పరుగులను కట్టడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు జట్టు మూడు వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేసింది. 

  • Loading...

More Telugu News