: దేవుడి సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: దిగ్విజయ్ సింగ్
విజయవాడలో కాంగ్రెస్ నేతలు ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. విజయవాడలోని వన్ టౌన్ లో ఏఐసీసీ ఏపీ ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు తదితర నేతలు ఈ ప్రజా బ్యాలెట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అన్నారు. బాలాజీ సాక్షిగా ఇచ్చిన హామీని వారు మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదని ఆయన తెలిపారు.