: కన్యత్వాన్ని వేలం ద్వారా 17 కోట్లకు అమ్మిన యువతి
జీవితాంతం కలిసి ఉంటాడో ఉండడో తెలియని వ్యక్తికి కన్యత్వాన్ని అప్పగించే కంటే తన విద్యకు అవసరమైన డబ్బుకోసం ఓ యువతి తన కన్యత్వాన్ని వేలం వేసిన ఘటన రోమేనియాలో చోటుచేసుకుంది. రొమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్ అనే యువతి తన కన్యత్వాన్ని వేలం వేయాలనుకుంటున్నానని సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనిపై పెను దుమారం రేగింది. అయితే తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటున్నానని, అందుకు విద్య చాలా అవసరమని, తన విద్యకు అవసరమయ్యే డబ్బు కోసం తన కన్యత్వాన్ని వేలం వేస్తున్నానని కన్విన్సింగ్ గా చెప్పింది.
భవిష్యత్తులో ఎవరైనా స్నేహితుడికైనా తాను తన కన్యత్వాన్ని సమర్పించాల్సిందేనని, ఆ తర్వాత అతడు తనతో శాశ్వతంగా ఉంటాడన్న గ్యారెంటీ కూడా లేదని తెలిపింది. జర్మనీకి చెందిన ఎస్కార్ట్ సంస్థతో బేరం కుదుర్చుకుని తన కన్యత్వాన్ని మిలియన్ యూరోల ప్రారంభ ధరతో వేలానికి పెట్టింది. హాంగ్ కాంగ్ కు చెందిన వ్యాపారవేత్త ఆమె కన్యత్వాన్ని 2.5 మిలియన్ యూరోలకు వేలం పాడుకున్నాడు. ఇందులో 20 శాతం జర్మనీకి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ సంస్థ ఒప్పందం ప్రకారం తీసుకుంటుంది. కాగా, ఆ యువతి ఫీజు కోసం కన్యత్వాన్ని వేలం వేసే దుర్భర ఆర్థిక స్థితిలో లేదని, ఆమె బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన యువతి అని తెలుస్తోంది.