: అల్లు అర్జున్, అఖిల్, అకీరాలకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ల జన్మదినం నేడు. ఈ సందర్భంగా వీరు ముగ్గురికీ ఫేస్ బుక్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు రామ్ చరణ్ తేజ్. ఒకే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియమైన ముగ్గురు సోదరులకు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు. మీ అందరికీ ఈ రోజు ఎంతో గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. వివిధ సందర్భాల్లో వీరి ముగ్గురితో కలిసి దిగిన ఫోటోలను అప్ లోడ్ చేశాడు.