: నా కొడుకును మాత్రం 'జూనియర్ పవర్ స్టార్' కానివ్వను: రేణు దేశాయ్
తనకు, పవన్ కల్యాణ్ కు పుట్టిన అకీరా నందన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రేణూ దేశాయ్ పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు. తనకు తానుగా అకీరా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, ఎన్నటికీ జూనియర్ పవర్ స్టార్ గా అకీరా ఉండకూడదని అన్నారు. ఆ నమ్మకం తనకుందని చెబుతూ, 'హ్యాపీ బర్త్ డే మై లిటిల్ స్వీట్ హార్ట్ అకీరా' అని ట్వీట్లు పెట్టారు. అకీరా 13 ఏళ్ల వయసులోనే ఆరు అడుగుల ఎత్తు పెరగడాన్ని నమ్మలేకున్నానని చెప్పారు. కాగా, గత సంవత్సరం అకీరా పుట్టిన రోజునాడు ఎంతో ఆనందంగా, తన ఇంట్లో మూడు పండగలు జరుపుకుంటున్నామని చెబుతూ ట్వీట్లు చేసిన రేణు, సంవత్సరం తిరిగే సరికి ఈ తరహా ట్వీట్లు చేయడం గమనార్హం.
— renu (@renuudesai) 8 April 2017