: నాని ముందు మరో ఇబ్బంది... తక్షణం జీతాలు చెల్లించాలని 'కేశినేని' ఆఫీసుల ముందు ఉద్యోగుల ధర్నా
అర్థాంతరంగా సంస్థను మూసి తమను రోడ్డున పడేయడంతో పాటు, తమకు చెల్లించాల్సిన వేతనాలను కూడా ఇవ్వలేదని కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు మూసేసిన కార్యాలయాల ముందు నిరసనలకు దిగారు. చెన్నై, బెంగళూరు సహా హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉన్న కేశినేని ఆఫీసుల ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారు. మూసివేత విషయాన్ని తమకు ముందుగా వెల్లడించలేదని, ఈ నిర్ణయంతో తాము ఉపాధిని కోల్పోయామని, వెంటనే నిబంధనల ప్రకారం, వేతనంతో పాటు పరిహారాన్ని తమకు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు వేతన బకాయిల విషయమై కేశినేని నాని స్పందించాల్సి వుంది.