: కేవీపీ, దిగ్విజయ్, రఘువీరా... అంతా ఒకే చోట!


కాంగ్రెస్ నేతలంతా ఒకే చోట చేరారు. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పాటించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విజయవాడలో పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, పల్లంరాజు, నాదెండ్ల మనోహర్, కిల్లి కృపారాణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎండగట్టడం, ప్రత్యేక హోదా సాధన కోసం తాము హామీ ఇచ్చినా, దాన్ని అమలు చేసేందుకు ముందడుగు వేయని బీజేపీతో టీడీపీ చెలిమి వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News