: ఆర్కే నగర్ లో కోట్లాది రూపాయల పంపిణీ


ఆర్కే నగర్ ఉపఎన్నికలో డబ్బు వరదై పారుతోంది. జయలలిత మరణంతో ఇక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. శశికళ వర్గం నుంచి దినకరణ్, పన్నీర్ సెల్వం వర్గం నుంచి మధుసూదనన్ లతో పాటు జయలిత మేనకోడలు దీప కూడా పోటీ చేస్తున్నారు. అన్ని పార్టీల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నేతలే బరిలోకి దిగారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కోట్లాది రూపాయలను నేతలు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పంచుతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏకంగా రూ. 80 కోట్లు వరకు పంపిణీ చేశారని సమాచారం. 

  • Loading...

More Telugu News