: కేజ్రీవాల్‌కు దూరంగా ఉంచి దేవుడు నన్ను కాపాడాడు..: అన్నా హజారే
కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుంచి దేవుడు తనను దూరంగా ఉంచి కాపాడాడని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత అన్నాహజారే అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వచ్చిన షుంగ్లు కమిటీ నివేదిక తనను తీవ్రంగా బాధించిందని హజారా ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టినప్పుడు కేజ్రీవాల్ తన పక్కనే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. అవినీతిని రూపుమాపాలన్న తన ఆశయాన్ని కేజ్రీవాల్ చెల్లాచెదురు చేశారని అన్నారు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టాలనుకున్నప్పటి నుంచి ఆయనకు తాను దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తానెప్పుడూ ఆయనను కలుసుకోలేదని పేర్కొన్న అన్నా హజారే, తన కీర్తి చెడిపోతుందని భావించిన దేవుడే తనను ఆయనకు దూరంగా ఉంచాడని అన్నారు. తనను దేవుడు కాపాడాడని అన్నారు.