: మా మామ చెప్పినా కూడా రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించకండి!: 'డ్వామా' పీడీలతో మంత్రి లోకేశ్
తన పేరుతో ఎవరు ఫోన్ చేసినా పట్టించుకోవద్దని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ డ్వామా పీడీలకు సూచించారు. శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అనంతరం సచివాలయంలో 'డ్వామా పీడీ' (జిల్లా నీటి నిర్వహణ సంస్థ-ప్రాజక్ట్ డైరెక్టర్) లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఎవరూ తప్పు చేయవద్దని, నిబంధనలకు విరుద్ధంగా ఫలానా పని చేయాలని తాను ఒత్తిడి తీసుకురానని చెప్పారు. తన పేరు మీద ఎవరు ఫోన్ చేసినా పట్టించుకోవద్దని, తన సొంత మనుషులు, చివరికి మా మామ చెప్పినా రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని అన్నారు. తనపైనా నిఘా ఎక్కువ ఉంటుందని, తాను మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ శాఖలో పనిచేస్తున్న అధికారులపై మరింత నిఘా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలని లోకేశ్ సూచించారు.