: శ్రీను వైట్ల నాతో సినిమా తీస్తానని అప్పుడే చెప్పారు: వరుణ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి ‘అందరివాడు’ సినిమాను శ్రీను వైట్ల తీస్తున్న సమయంలోనే, తనతో కూడా ఓ సినిమా తీస్తానని శ్రీను వైట్ల తన తండ్రి నాగబాబుతో చెప్పారని వరుణ్ తేజ్ అన్నాడు. ‘మిస్టర్’ ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ,‘అప్పుడు, శ్రీను వైట్ల చెప్పినట్టుగానే నాతో మిస్టర్ చిత్రం తీశారు. నేను చేసిన చిత్రాల్లో కొన్ని విజయవంతమయ్యాయి. మరికొన్ని కాలేదు. అయినప్పటికీ, ప్రేక్షకులు నా వెన్నంటి ఉండి ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మిస్టర్ చిత్రం కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. మిస్టర్ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని కోరిన వెంటనే మా డాడీ చిరంజీవి గారు ఒప్పుకున్నారు’ అని వరుణ్ అన్నాడు. ఈ సందర్భంగా బాబాయి పవన్ కల్యాణ్, రామ్ చరణ్ , బన్నీలను వరుణ్ గుర్తు చేసుకున్నాడు.